'ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకే సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్' - MLC Jeevan Reddy Fires on BJP
Published : May 31, 2024, 6:51 PM IST
MLC Jeevan Reddy on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకే మిత్రపక్షమైన బీజేపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎలా బీజేపీకి కొమ్ముకాసిందో చూశామని అన్నారు. దీనికి ప్రతిఫలంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడాలని కమలం పార్టీ చూస్తుందని మండిపడ్డారు.
MLC Jeevan Reddy Fires on BJP : ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడటం ఎవరి తరం కాదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఎల్ సంతోశ్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఇరికించారని చెబుతున్నా, బీజేపీ ఎందుకు నిరూపించలేక పోయిందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకుందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల డ్రామాలు ఇప్పటికైనా నిలిపి వేయాలని హితవు పలికారు.