'దేశానికి ఏం చేశారని బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు' - బీజేపీపై జీవన్‌రెడ్డి ఫైర్
Published : Feb 23, 2024, 3:01 PM IST
MLC Jeevan Reddy Fires On BJP : దేశానికి ఏం చేశారని బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతాంగం అంతా దిల్లీ సరిహద్దులో కనీస మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులను కాకుండా అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు ఎన్పీ అకౌంట్ల ద్వారా రుణ విముక్తులను చేస్తున్నారని విమర్శించారు.
రైతులను రుణవిముక్తులను ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మద్దతుధరకప చట్టభద్దత కల్పిస్తే రైతులు మద్దతు ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నిత్యవసర ధరలపై పట్టించుకోవటం లేదని దీని వల్ల సామాన్య ప్రజలపై మరింత భారం పెరుగుతోందని మండిపడ్డారు. పెట్రోలు ధరలు తగ్గించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. పదేళ్లుగా పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పని చేసింది పేదల కోసం కాదని విమర్శించారు. దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అలాంటి రైతాంగానికి కేంద్రం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు.