తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీనియర్ డ్రైవర్​లా ఆర్టీసీ బస్సును నడిపిన ఎమ్మెల్యే రేవూరి - MLA Revuri Launched RTC Buses

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 5:08 PM IST

MLA Revuri Prakash Reddy Launched New RTC Buses : హనుమకొండ జిల్లా పరకాలలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే, సరదాగా కాసేపు బస్సును నడిపి అక్కడున్న వారిని అబ్బురపరిచారు. ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కాకుండా ప్రొఫెషనల్ డ్రైవర్​లా డ్రైవింగ్ చేశారు. 

MLA Revuri Prakash Reddy Launched RTC Buses in Parkal : కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు సర్వీసులను అమలు చేసిందని, ఆ దిశగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పెంచే లక్ష్యంతో ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1400 బస్సులను కేటాయించగా, పరకాల ఆర్టీసీ డిపోకు 20 బస్సులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ఏడు బస్సులు అందుబాటులో ఉండగా, రెండు మేడారం జాతరకు వెళ్లనున్నాయని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details