ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దర్యాప్తు అధికారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు - హైకోర్టులో పిన్నెల్లి - Pinnelli Lunch Motion Petition - PINNELLI LUNCH MOTION PETITION

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 7:07 PM IST

Pinnelli Ramakrishna Reddy Lunch Motion Petition: సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్ మిషన్ ద్వంసం, టీడీపీ కార్యకర్తలపై దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ పిన్నెల్లి పిటిషన్​లో పేర్కొన్నారు. లంచ్ మోషన్​ను అనుమతించిన న్యాయస్థానం పిటిషన్​పై విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీను కూడా మార్చాలంటూ పిన్నెల్లి పిటిషన్​లో కోరారు. 

ఇప్పటికే పిన్నెల్లిని మాచర్ల వెళ్లొద్దని హైకోర్టు ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 6 వరకు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్​ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది.  

ABOUT THE AUTHOR

...view details