ETV Bharat / state

పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని, ఆయన కుమారుడు - PERNI NANI KITTU PETITION IN HC

రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసు నోటీసును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పేర్ని నాని, ఆయన కుమారుడు పిటిషన్‌ - మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి

High Court on Perni Nani Petition Withdrawn
High Court on Perni Nani Petition Withdrawn (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

High Court on Perni Nani Petition Withdrawn : గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్ని నాని, ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం పరిశీలించింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు. గడువు ముగిసినందున పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని, తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు.

మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోదామును పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయని చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జయసుధ బెయిల్ పిటిషన్‌ మరోసారి వాయిదా పడింది. ప్రాసిక్యూషన్ తరపున ఇవాళ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ సెలవు పెట్టారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవటంతో పిటిషన్‌ను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు. అలాగే కౌంటర్ దాఖలు విషయంలో పోలీసుల తీరుపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు.

రేషన్ బియ్యం కేసులో నానికి మరోసారి నోటీసులు ఇస్తాం - కృష్ణా జిల్లా ఎస్పీ

పేర్నినాని భార్య జయసుధ బెయిల్ పిటిషన్‌పై వాయిదా పడటం ఇది నాలుగోసారి. గత పది రోజులుగా జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. బెయిల్‌పై క్లారిటీ వచ్చే వరకు ఆమె బయటకు వచ్చే అవకాశం లేదని సమాచారం. జయసుధపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇటీవల పేర్ని నాని కుటుంబానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు సహకరించాల్సిందిగా పేర్నినాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ పేర్నినాని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులను అంటించారు. నోటీసులను పేర్ని నాని చూడకపోవడంతో మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

బ్లాక్​ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్​! - రేషన్‌ బియ్యం మచిలీపట్నం తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.