తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - Rushikonda building visuals

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 7:16 PM IST

MLA Ganta Srinivasa Rao visit Rushikonda Constructions : జగన్ ప్రభుత్వం విశాఖ రిషికొండపై అడ్డగోలుగా అక్రమ కట్టడాలను నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారని, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇవాళ కూటమి శ్రేణులతో కలిసి భవనాలను పరిశీలించారు. రుషికొండ భవన నిర్మాణంపై, ఎన్జీటీ ఆదేశాలను సైతం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. రిషికొండపై రూ 500 కోట్లతో నిర్మించిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదన్నారు. 

జగన్ అధికారంలోకి రాగానే, అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ ప్రజావేదికను పడగొట్టారని, మరి ఈభవనంపై జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. త్వరలో చంద్రబాబు విశాఖ పర్యటన ఉంటుందని, రిషికొండ భవనాన్ని చంద్రబాబు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈభవనంపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖపట్నానికి పూర్వవైభవం తీసుకువస్తామని వెల్లడించారు. త్వరలో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలతో పాటు, భూ దోపిడీపై విచారణ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో, 9.8 ఎకరాల్లో ఏడు బ్లాక్‌లుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో రూ.కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నీచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు.

ABOUT THE AUTHOR

...view details