'అగ్నికుల క్షత్రియులను అవమానించిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి' - Agnikul Kshatriyas Demand
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 7:05 PM IST
MLA Dwarampudi Chandrasekhar Reddy Insulted Agnikul Kshatriyas in Prakasam District : అగ్నికుల క్షత్రియులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆ సంఘం నాయకురాలు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నికుల క్షత్రియ జాతికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు తమ ఓటు బలంతోనే గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కులం పేరుతో దూషించటం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
Agnikul Kshatriyas Demand : రానున్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే మత్స్యకారులందరూ వైసీపీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు కృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఏకం అయ్యి వైసీపీ ఓటమికి కృషి చేస్తామని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తక్షణమే తమ కులానికి బహిరంగంగా చంద్రశేఖర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.