ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వ్యవసాయ కుటుంబం నుంచి మోడలింగ్‌ వైపు - మిస్​ యూనివర్స్​ ఇండియాగా తెలుగమ్మాయి - Miss Universe AP Chandana Interview - MISS UNIVERSE AP CHANDANA INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 12:58 PM IST

Miss Universe AP Chandana Jayaram Interview: సాధారణంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు ఫ్యాషన్ రంగానికి ఆమడ దూరంలో ఉంటారు. కానీ తల్లిదండ్రుల పూర్తి సహకారంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది తెలుగమ్మాయి చందనా జయరాం. మోడల్‌గా రాణిస్తూనే బ్యూటీ పేజెంట్లలోనూ సత్తా చాటుతోంది. ఇటీవల హైదరాబాద్​లో నిర్వహించిన పోటీల్లో చందన జయరాం మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికైంది. ఏపీ సీఎం సొంత నియోజకవర్గం నుంచి తొలిసారి మిస్ యూనివర్స్‌ ఏపీగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 

వ్యవసాయ కుటుంబం నుంచి మోడలింగ్‌ రంగంలోకి అడుగు పెట్టిన చందన దాదాపు 100 మందితో పోటీపడి కిరీటం కైవసం చేసుకుంది. మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన ఆమెను సచివాలయంలో ఇటీవలే సీఎం చంద్రబాబు అభినందించారు. కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ముంబయిలో జరగనున్న మిస్ యూనివర్స్‌ ఇండియాకు ఎంపికైన చందనా జయరాంతో చిట్‌చాట్‌.

ABOUT THE AUTHOR

...view details