మైనర్ బాలికపై హత్యాచారం - ఐదుగురు నిందితులు అరెస్ట్ - Minor Girl Disappearance Case - MINOR GIRL DISAPPEARANCE CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 8:14 PM IST
Minor Girl Disappearance Case Updates: నంద్యాల జిల్లాలో మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసులో వివరాలను ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన అదృశ్యమైన బాలికను ముగ్గురు మైనర్లు మాయమాటలు చెప్పి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకెళ్లారని ఎస్పీ తెలిపారు. అనంతరం గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శవాన్ని తీసుకొచ్చి కెనాల్ వద్ద దాచి ఆ విషయాన్ని మైనర్లు వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారు అదే రోజు రాత్రి శవాన్ని అక్కడ నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలోకి పుట్టిలో తీసుకెళ్లి శవాన్ని తాడుతో రాయికి కట్టి నీటిలో పడేసినట్లు ఓ నిందితుడి బంధువు ఒప్పుకున్నట్లు వివరించారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.