ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు నెలల్లో సోమశిల ఆప్రాన్ పనులు ప్రారంభిస్తాం: నిమ్మల - Somashila Reservoir Works

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 3:59 PM IST

Ministers_Inspected_Somashila_Reservoir_Works (ETV Bharat)

Ministers Inspected Somashila Reservoir Works: రెండు నెలల్లో సోమశిల ఆప్రాన్ పనులు ప్రారంభిస్తామని జలవనులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. సోమశిల జలాశయం పనులను ముగ్గురు మంత్రులు పరిశీలన చేశారు. అనంతరం సోమశిల అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమశిల జలాశయ అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. 

మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా ఉమ్మడి నెల్లూరు జిల్లా శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ తోపాటు సోమశిల జలాశయ ఆప్రాన్​ను మంత్రులు పరిశీలించారు. జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు. అనంతరం తుపాన్​కు దెబ్బతిన్న సోమేశ్వరాలయాన్ని మంత్రులు సందర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details