తెలంగాణ

telangana

ETV Bharat / videos

విధుల్లో నిర్లక్ష్యం - డీఈ సస్పెండ్​కు​ మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు జారీ - Minister Uttam Warn to Officers - MINISTER UTTAM WARN TO OFFICERS

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 7:28 PM IST

Minister Uttam Kumar Warning to NSP Officers : క్షేత్రస్థాయిలో పనిచేయని ఎన్ఎస్పీ అధికారులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల, రోడ్డు భవనాల అధికారుల పనితీరుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ పనుల్లో అలసత్వం ప్రదర్శించిన  అధికారులపై సీరియస్​ అయ్యారు. పంపింగ్​ లిఫ్ట్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తే కనీసం చుట్టుపక్కలకు వెళ్లకపోవడం ఏంటని హుజూర్​నగర్​ డీఈని ప్రశ్నించారు. వెంటనే డీఈని సస్పెండ్ చేయాలని కలెక్టర్ నందలాల్​కు సమావేశంలోనే ఆదేశాలు ఇచ్చారు.

ఆగస్టు 30 వరకు అన్ని లిఫ్ట్ పనులు 90 శాతం పూర్తి కావాలని అధికారులను కోరారు. రైతులకు లిఫ్ట్లను అందించలేని  పక్షంలో తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీళ్లను వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఆయకట్టు కింద ఉన్న అన్ని చెరువులను నింపుతామని తెలిపారు. ఆర్&బీ సమీక్షలో పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యేక నిధులు ఏర్పాటుపై అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details