LIVE : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం - MINISTER UTTAM PRESS MEET LIVE - MINISTER UTTAM PRESS MEET LIVE
Published : Jul 28, 2024, 2:16 PM IST
|Updated : Jul 28, 2024, 2:57 PM IST
Minister Uttam Kumar Reddy Live : ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత కూడా మీదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టుర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎర్రమంజిల్ లోని జల సౌదలో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు. పనులు మంచిగా పూర్తి చేసి వారిని తప్పకుండా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవన్నారు. పనుల్లో కమిట్‌మెంట్ సిన్సీయారిటీ తప్పకుండా ఉండాలన్నారు. సమీక్ష అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Last Updated : Jul 28, 2024, 2:57 PM IST