తెలంగాణ

telangana

ETV Bharat / videos

అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల - Minister Thummala latest news

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 1:27 PM IST

Minister Tummala Visited Ashwaraopeta Oil Palm Industry : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఆయిల్ పామ్​ పరిశ్రమను సందర్శించిన ఆయన, అక్కడ రూ.30 కోట్లతో బయో విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బయో విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో కరెంట్‌ ఛార్జీల భారం తగ్గుతుందని వివరించారు. మే నెలలోపు పవర్‌ ప్లాంట్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అనుకున్న సమయంలోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

Bio Power Plant At Aswaraopeta : ప్లాంట్​ విద్యుత్​ ఖర్చు సుమారుగా రెండున్నర కోట్లు కట్టాల్సి వస్తోందన్నారు. స్ధానిక ముడి సరుకు ఉపయోగించి, రూ.30 కోట్ల వ్యయంతో బయో విద్యుత్​ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తామని తుమ్మల వివరించారు. జెన్​కో ట్రాన్స్​ పవర్​ వచ్చినా, రాకపోయినా ప్లాంట్​ ఏర్పాటు చేసి, దాని పవర్​తో ఈ ఫ్యాక్టరీ నడిచేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అది మే నెలలోనే పూర్తవుతుందని, దానికి సంబంధించిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details