ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే మా సంకల్పం : మంత్రి శ్రీధర్ - SRIDHAR INAUGURATED IT SOLUTION - SRIDHAR INAUGURATED IT SOLUTION
Published : Jul 4, 2024, 2:33 PM IST
Minister Sridhar Babu Inaugurated IT Solution in Hanamkonda : వరంగల్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హనుమకొండలోని రాక్స్ ఐటీ సొల్యూషన్ను ఆయన ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో బహుళ జాతీయ కంపెనీలను త్వరలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఐటీ కేంద్రంగా, విద్యానగరిగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.
ఐటీ కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు : ప్రైవేటు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. పుట్టిన గడ్డపై మమకారం తీర్చుకునేందుకు ప్రవాస భారతీయులు రాష్ట్రానికి వచ్చి ఐటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నూతనంగా రాక్స్ ఐటీ సొల్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన బృందానికి మంత్రి అభినందనలు తెలియజేశారు.