తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేడిగడ్డ కుంగిన తర్వాత వచ్చి చూడడం వల్ల ఏం లాభం : శ్రీధర్​ బాబు

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 6:22 PM IST

Minister Sridhar Babu Fires on BRS : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో నాణ్యతా నిర్మాణాల పనులు చూడకుండా.. ఇప్పుడు చూడటం వల్ల ఏం లాభం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ నాయకులు చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో గృహజ్యోతి కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిపుణుల సూచనల కోసం ప్రభుత్వం వేచి చేస్తుంటే కాంగ్రెస్​ పార్టీ రాజకీయం చేస్తోందని బీఆర్​ఎస్​ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. 

రీ డిజైన్​ చేయవద్దని అక్కడ ప్రాజెక్టు నిర్మాణం సహేతుకం కాదని నిపుణులు సలహా ఇచ్చిన పెడచెపిన పెట్టారని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కుంగిపోయిన మేడిగడ్డ, బుంగలు పడి అన్నారం బ్యారేజీ చూసిన తర్వాతనైనా కాంగ్రెస్​, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలు రాజకీయం చేయడం లేదని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెబితే చాలన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేస్తున్నామని శ్రీధర్​ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details