తెలంగాణ నయాగరా బొగత జలపాతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క - Seethakka at Bogatha Waterfalls - SEETHAKKA AT BOGATHA WATERFALLS
Published : Jul 22, 2024, 10:38 PM IST
Seethakka visited Bogatha Waterfalls : ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వీక్షించారు. మూడు రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించేందుకు మంత్రి సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతం నుంచి కొండ కోనల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్న తెలంగాణ నయాగరా జలపాతాన్ని సీతక్క సందర్శించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని అధికారులుతో ఆమె వీక్షించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. జలపాతం వద్ద ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. పర్యాటకులను ఆనందపరిచే విధంగా మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.