తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆద్యకళ పరికరాల పరిరక్షణ కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి : మంత్రి సీతక్క - ఆద్యకళ పరికరాలను పరిశీలించిన సీతక్క

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 11:57 AM IST

Minister Seethakka Visit Musical instruments : ప్రముఖ విశ్రాంత అధ్యాపకులు జయధీర్ తిరుమలరావు సేకరించిన ఆధ్యకళ పరికరాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మ్యూజియం నిర్మించేలా చొరవ తీసుకోనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జానపద, గిరిజన కళలు, సంస్కృతి అధ్యయనం పరిరక్షణపై హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Seethakka watched musical instruments : ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆద్యకళ పరికరాలను ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి వీక్షించారు. వివిధ రకాల వాద్యాలతో వినూత్నంగా ఉండే పరికరాలను చూసిన సీతక్క, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన, జానపద, ఆదివాసీల కళారూపాలు, పరికరాలు భవిష్యత్ తరాలకు చూపించేందుకు, వాటి ప్రాధాన్యత తెలియజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు సీతక్క తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details