తెలంగాణ

telangana

ETV Bharat / videos

పేదింటి తలుపు తట్టిన పొన్నం - అగ్రనేత మాటిచ్చింది - మంత్రి పాటించాడు! - Minister Ponnam Met Poor family - MINISTER PONNAM MET POOR FAMILY

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 10:48 PM IST

Minister Ponnam Visit to Common Woman House : గతంలో కాంగ్రెస్​ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ముచ్చటించిన కుటుంబం ఇంటికి ఉగాది పండుగ వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు.​ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు వచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, తిరిగి రోడ్డు మార్గాన వెళ్తున్న సమయంలో దారి మధ్యలో స్థానిక జంటను కలుసుకున్న సంగతి తెలిసిందే. కిషన్ నగర్​కు చెందిన జాగిరి రాజయ్య-రమాదేవిలతో ప్రియాంక కలిసి మాట్లాడి, వారికి తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వెళ్లారు.

ఆ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వారికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేడు ఆ మాటకు కట్టుబడి ఉగాది వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి ఇంటికి వెళ్లి బాగోగులు తెలుసున్నారు. వారికున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వచ్చి వారితో కాసేపు మాట్లాడడంతో రాజయ్య - రమాదేవి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details