మార్చి నుంచి రూ.500కే గ్యాస్‌సిలిండర్, గృహజ్యోతి : పొన్నం - ponnam slams bjp
Published : Feb 22, 2024, 2:07 PM IST
Minister Ponnam Fires On KCR : 10 సంవత్సరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అవినీతిని బయట పెడితే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల చలువతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పొన్నం అన్నారు. వచ్చే నెలలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ పథకాలను అమలోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవాకులు చివాకులు పేలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. ప్రభుత్వానికి సహకరించే సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3, 4 వేల ఇళ్లు మొదటి విడత ప్రక్రియ అప్లికేషన్లు తీసుకున్నట్లు చెప్పారు. రైతు భరోసా తప్పకుండా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపాదిస్తేనే కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు.