తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు - ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి - World Photography Day Celebrations - WORLD PHOTOGRAPHY DAY CELEBRATIONS

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:24 PM IST

World Photography Day Celebrations In Hyderabad : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రచార, సమాచార శాఖమంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ఫొటో ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం వివిధ అంశాల్లో ఫొటోలు తీసిన 40 మంది ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. మొదటి బహుమతికి రూ. 20వేలు, రెండో బహుమతికి రూ.15వేలు, 3వ బహుమతికి రూ.10 వేల రూపాయల నగదు అందజేశారు. 

ప్రకృతి, పర్యావరణం, జీవనశైలి, ట్రావెల్, నగర జీవనం వంటి వివిధ విభాగాల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫొటో గ్రాఫర్లు పడుతున్న కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఫొటో ద్వారా చూపించారని పొంగులేటి అన్నారు. ఎక్కువగా పెద్ద వార్తను చదువుతున్నప్పుడు ఫొటోలు చూసి వార్తను అర్థం చేసుకుంటున్నామని అన్నారు . ఫొటోగ్రాఫర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details