పూర్తి శాస్త్రీయ పద్దతిలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు : మంత్రి పొంగులేటి - Ponguleti on Registration Fees Hike - PONGULETI ON REGISTRATION FEES HIKE
Published : Aug 18, 2024, 7:19 PM IST
Minister Ponguleti on Registration Fees Hike : పూర్తి శాస్త్రీయ పద్దతిలోనే రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విషయంలో నాటి ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆయన, రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో సైంటిఫిక్గా కాకుండా ఏదో రేట్లు పెంచాలన్న దృక్పథంతో ఒకసారి, మళ్లీ 2022 ఏడాదికి గానూ 6 నెలల్లో రెండుసార్లు గత బీఆర్ఎస్ పెంచిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్డు విలువలు సైంటిఫిక్గా పెంచకుండా లంచంగా మార్చిందని ఆరోపించారు. నాటి అసాధారణ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ, శాస్త్రీయబద్ధంగా విలువలు పెంచాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
రిజిస్ట్రేషన్ ఫీజు పరంగా కాకుండా కార్డు విలువను మార్కెట్ ధరకు దగ్గరగా ఉంచాలని తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. రెవెన్యూతో పాటు పెంచేది చట్టబద్దంగా ఆక్షేపణ లేకుండా కొనుగోలుదారులు, విక్రేతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక సైంటిఫిక్ సిస్టమ్లో పెంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆ వివరాలను అధికారులు 95 శాతం వరకు సేకరించారని, తుది రూపంలో అవి ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఒక థర్డ్ పార్టీతో కూడా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. వీటన్నింటిని సరిపోల్చి మార్కెట్ విలువను నిర్ధారించనున్నట్టు తెలిపారు. దానిపై ఈ స్టాంప్ డ్యూటీది కూడా ఫిక్స్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు.