ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 12:59 PM IST

ETV Bharat / videos

రెల్లి కాలనీలో పర్యటించిన మంత్రి - సమస్యలను అడిగి తెలుసుకున్న నారాయణ - Minister Narayana visit

Minister Narayana visit to Vijaywada: తాగునీరు పైపులు, డ్రైనేజీలు పక్కపక్కనే ఉండటంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. డ్రైనేజీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తే ఈ సమస్య రాదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వంద శాతం పూర్తి అయితే ఇటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, అ‍ధికారులతో కలిసి పటమటలోని రెల్లి కాలనీలో పర్యటించారు. 

తాగునీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియా వచ్చే ప్రమాదం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని, ఈరోజు రెల్లి కాలనీలో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నానన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఓపెన్ డ్రెయిన్ల వద్ద నీరు పొంగడం వల్ల మంచినీటి పైపుల్లో కలిసే ప్రమాదం ఉందని అన్నారు.  ఓపెన్ డ్రైన్స్, ట్యాప్​లు పక్కపక్కన లేకుండా పలు మున్సిపాలిటీల పరిధిలో పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారని గద్దె రామ్మెహన్‌ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details