ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

"ఏపీలో మెగాసిటీ నిర్మాణం" - స్థిరాస్తి లేఔట్ అనుమతుల్లో సడలింపులు : మంత్రి నారాయణ - MINISTER ABOUT TOWN PLANNING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2024, 2:16 PM IST

Minister Narayana About Town Planning Layout : విజయవాడ, మంగళగిరి, అమరావతి, గుంటూరు కలిపి మెగాసిటీగా మారతాయని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆ విధంగానే అమరావతి నిర్మాణ ప్రణాళికలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. జనవరిలో జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షోకు సంబంధించి గుంటూరు క్లబ్‌లో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికరంగం పురోగమనానికి స్థిరాస్తి రంగం చాలా కీలకమని అందుకే లే ఔట్ల అనుమతులు విషయంలో సడలింపులు తెస్తున్నామని నారాయణ వివరించారు.

శనివారం జరిగిన శాసనసభలో  పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకులకు డీడీల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తామని రాష్ట్రవెల్లడించిన సంగతి తెలిసిందే. గుత్తేదారులకు పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపులు, ఇతర విషయాలపై పరిశీలన చేసేందుకు చీఫ్‌ ఇంజినీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లుల విలువ రూ.540 కోట్ల వరకు ఉందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details