ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE విజయవాడలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్ - LOKESH START MID DAY MEAL SCHEME

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 12:06 PM IST

Updated : Jan 4, 2025, 1:51 PM IST

Lokesh Start Mid Day Meal Scheme Live :  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు ప్రారంభిస్తున్నారు.దీని వల్ల 1,48,419 మంది ఇంటర్‌ విద్యార్థులకు భోజనం అందనుంది. విజయవాడ పాయకాపురంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jan 4, 2025, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details