ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కృషిచేసే ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తున్నాం: మంత్రి లోకేశ్​ - INNOVATIVE IDEAS IT SECTOR DEVELOP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 12:15 PM IST

Minister Lokesh Encourage Innovative Ideas to Economic Development in AP : వినూత్న ఆలోచనలతో ఏపీ ఆర్థికాభివృద్ధికి కృషి చేసే ప్రతిభావంతుల కోసం తమ అన్వేషణ సాగుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ పిలుపునిచ్చారు. అటువంటి అభిరుచి ఉన్నవారి నుంచి సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని లోకేశ్​ తెలిపారు. హైదరాబాద్​లో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు సృష్టించిన ఐటీ విప్లవం చరిత్ర ఆంధ్రప్రదేశ్​లో తిరిగి పునరావృతం అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో ఓ చరిత్ర సృష్టించేలా తయారీరంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని లోకేశ్​ హర్షం వ్యక్తం చేశారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా మరోసారి తాము మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాల పెంపు, మానవ వనరుల ప్రయోజనంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రధాన పెట్టుబడిదారులు స్నేహపూర్వక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు కలిసి కట్టుగా కృషి చేస్తామని లోకేశ్​ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details