ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు దిల్లీ పర్యటనపై అప్పుడు స్పందిస్తా - మంత్రి బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Botsa Satyanarayana

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 6:54 PM IST

Minister Botsa Satyanarayana Comments: చంద్రబాబు దిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అసలు చంద్రబాబు దిల్లీకి పొత్తుల కోసం వెళ్లారో, మరొక కారణంతో వెళ్లారో తనకు తెలియదన్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత, నిజంగా ఆయన పొత్తుల కోసం వెళ్తే అప్పుడు స్పందిస్తానని అన్నారు. టీడీపీ రాజకీయ పార్టీ కాబట్టి ఎన్నికలప్పుడు మరో పార్టీతో కలవడం ఆనవాయితీగా మారిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని ఎప్పుడో తేల్చి చెప్పామని గుర్తుచేశారు. గడచిన ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచి, సంక్షేమ కార్యక్రమాలతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఎవరితో వెళ్లినా తమకు అప్రస్తుతమన్నారు. స్థానచలనం కలిగిన ఎమ్మెల్యేల అసంతృప్తికి ఏమైనా నిర్వచనం ఉందా అని ప్రశ్నించారు. పార్టీలోనే ఉన్నవారికి అవసరమైనప్పుడు అవకాశాలు కల్పిస్తామని తేల్చిచెప్పారు. షర్మిలకు ఉన్న భద్రతను తగ్గించలేదని, ఈ విషయంపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. 2014లో మంత్రిగా ఓడిపోయాక తానే తన గన్​మెన్లను వెళ్లిపొమ్మని చెప్పానని, జిల్లా ఎస్పీ కుదరదని చెప్పి వాళ్లను మళ్లీ తన దగ్గరకు పంపారని గుర్తుచేశారు. అయితే వారం రోజుల తర్వాత మళ్లీ వాళ్లను వెనక్కు తీసుకున్నారని, ఆ నిర్ణయానికి తనకు హాని లేదని సంతోషం వ్యక్తం చేశానన్నారు. 

ABOUT THE AUTHOR

...view details