ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు : మంత్రి టీజీ భరత్​ - Minister Start VasaviVysya Building - MINISTER START VASAVIVYSYA BUILDING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 6:51 PM IST

Minister Bharat Inaugurated Vasavi Vysya Building in Kurnool: వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నూతనంగా నిర్మించిన వాసవి వైశ్య వసతి భవనాన్ని మంత్రి భరత్ ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని మంత్రి అన్నారు. 

గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడి దారుల్లో రాష్ట్రం పట్ల ప్రతికూలత ఏర్పడిందని దాన్ని పోగొట్టడంపై తక్షణం దృష్టి పెడతామని ఆయన అన్నారు. పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు సృష్టించి ఔత్సాహికులను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రావటం ద్వారానే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌సీ సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలకూ పలు ప్రయోజనాలు లభిస్తాయన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details