ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇళ్లకు తాళాలు వేసి ఉంటే వాళ్లకు పండగే- అర్ధరాత్రి ఆరు ఇళ్లలో హవా - Mid Night Robbery In Nellore - MID NIGHT ROBBERY IN NELLORE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 2:16 PM IST

Mid Night Robbery In Nellore District : నెల్లూరు జిల్లా సంగంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో ఆరు ఇళ్లలో చోరీ జరిగింది. ఇళ్ల తాళాలు పగులగొట్టిన దుండగులు అందిన కాడికి అపహరించారు. ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకొని వెళ్లారని బాధితులు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల దొంగతనాలు పెరిగిపోతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఇళ్లలో ఎవ్వరూ లేని సమయం చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఎక్కడికైనా వెళ్లాలంటే జంకుతున్నామని ప్రజలు తెలిపారు. రోజు రోజుకు దొంగతనాలు ఎక్కువవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు, సమాచారం అందించాలని తెలిపారు. అపరిచితులతో జాగ్రత్తగా మెలగాలని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details