శిల్పకళా వేదికగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ - స్పెషల్ అట్రాక్షన్‌గా డైరెక్టర్స్ బాబీ, వశిష్ట - MEGASTAR BIRTHDAY CELEBRATIONS 2024 - MEGASTAR BIRTHDAY CELEBRATIONS 2024
Published : Aug 22, 2024, 3:51 PM IST
MEGASTAR BIRTHDAY CELEBRATIONS 2024 : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. శిల్పకళా వేదికగా జరిగిన వేడుకలకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు హాజరై సందడి చేశారు. దర్శకుడు బాబీ, వశిష్ట, జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కోసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ప్రముఖ ఫైట్ మాస్టర్ పొన్నాంబలం చెన్నై నుంచి తరలివచ్చి మెగాస్టార్‌తో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారని ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా దర్శకులు బాబీ, వశిష్టలు పొన్నాంబలాన్ని ఘనంగా సత్కరించారు.
నాలుగు దశాబ్దాలుగా ఆగస్టు 22 వచ్చిదంటే మెగా అభిమానులకు నిజమైన పండుగ వచ్చినట్లు ఉంటుందన్న దర్శకుడు బాబీ, సామాన్యులెవరైనా సరే జీవితంలో ఎదగవచ్చు, పోరాడి గెలువచ్చు అనేది నిరూపించిన మెగాస్టార్ కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారనన్నారు. అయితే ఎన్ని కోట్ల మంది అభిమానులున్నా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచి నిజమైన అభిమానాన్ని పవన్ కల్యాణ్ చాటుకున్నారని బాబీ గుర్తుచేశారు.