కొనసాగుతోన్న మేడారం హుండీల లెక్కింపు - ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలుసా? - Fifth Day Medaram Hundi Collection
Published : Mar 5, 2024, 1:07 PM IST
Medaram Hundi Counting at Hanamkonda : మేడారం మహా జాతర హుండీ లెక్కింపు ఆరో రోజు పటిష్ఠ భద్రత మధ్య కొనసాగుతోంది. ఐదో రోజు 76 హుండీలను లెక్కించగా, రూ.93 లక్షల 67 వేల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగిన మేడారం మహా జాతర సందర్భంగా దేవాదాయ శాఖ ఆలయ ప్రాంగణంలో 540 హుండీలను ఏర్పాటు చేశారు.
Fifth Day Medaram Hundi Collection : హనుమకొండలోని తితిదే వారి కల్యాణ మండపంలో హుండీ లెక్కింపును అధికారులు ఫిబ్రవరి 29న ప్రారంభించారు. తొలి రోజు 134, రెండో రోజు 71, మూడవ రోజు 112, నాల్గవ రోజు 88, ఐదో రోజు 76 హుండీలను లెక్కించగా, ఇప్పటి వరకు రూ.11 కోట్ల 25 లక్షల 70 వేల ఆదాయం వచ్చిందన్నారు. నేడు ఆరో రోజు హుండీల లెక్కింపు కొనసాగుతుండగా, ఈ ప్రక్రియ ఇంకా రెండు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.