తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాగార్జునసాగర్​కు పోటెత్తుతున్న కృష్ణమ్మ - 22 గేట్లు ఎత్తి నీటి విడుదల - NAGARJUNA SAGAR 22 GATES LIFTED - NAGARJUNA SAGAR 22 GATES LIFTED

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 1:36 PM IST

Updated : Aug 6, 2024, 2:49 PM IST

Nagarjunasagar 22 Gates Lifted : నాగార్జునసాగర్​ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 22 క్రస్ట్​ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఇన్​ఫ్లో 3,74,649 క్యూసెక్కుల నీరు వస్తోంది. 

సాగర్​ క్రస్ట్​ గేట్లలో 16 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, మరొక నాలుగు గేట్లను ఐదు అడుగుల మేరకు లిఫ్ట్​ చేసి స్పిల్​వే ద్వారా రెండు లక్షల 55వేల 296 క్యూసెక్కుల నీరు దిగువనకు విడుదల చేస్తున్నారు. సాగర్​ ఔట్​ఫ్లో 3,54,684 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతుంది. మరొక ఆరు గేట్లను వరద ప్రవాహాన్ని బట్టి ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

Last Updated : Aug 6, 2024, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details