పటాన్‌చెరులో తుక్కు దుకాణంలో అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణనష్టం - Fire Accident in Scrap Godown - FIRE ACCIDENT IN SCRAP GODOWN
Published : May 3, 2024, 8:37 AM IST
Fire Accident in Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు నక్కవాగు సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. పూజ ఎంటర్‌ప్రైజెస్ తుక్కు దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు అలుముకోవడంతో దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించాల్సివచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Massive Fire Accidents in Telangana : మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వస్తువులకు చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు వ్యాపించి అగ్నిప్రమాదానికి దారితీస్తున్నాయి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అలానే అగ్నిప్రమాదానికి గురయ్యే ప్రాంతంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గత నెల నుంచి ఎక్కువగా పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాగా వాహనాలు కూడా అగ్ని ప్రమాదాలకు గురికావడం గమనార్హం.