తెలంగాణ

telangana

ETV Bharat / videos

బనియన్‌కు 54 జేబులు - వాటిలో 48 దేశీదారు సీసాలు - వైరల్​ వీడియో - Man Supplying Liquor by Banian - MAN SUPPLYING LIQUOR BY BANIAN

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 10:40 AM IST

Man Supplying Liquor by Banian in Adilabad : సాధారణంగా అందరూ చొక్కాలకు, ప్యాంట్లకు జేబులు కుట్టించుకుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామానికి చెందిన మునీశ్వర్ సత్య నారాయణ కొత్తగా ఆలోచించి బనియన్‌కు జేబులు కుట్టించుకున్నాడు. ఒకటో రెండో కాదు, ఏకంగా 54 జేబులు ప్రత్యేకంగా కుట్టించాడు. వాటిలో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమంగా మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యం సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్రలో 48 దేశీదారు సీసాలు కొని బనియన్‌కు కుట్టించిన జేబుల్లో దాచుకుని ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు.

Police nabs Man Supplying for Country Liquor : ఈ క్రమంలో ఆదిలాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ వద్ద అతణ్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అక్రమంగా మద్యం రవాణా చేయడానికి ఇలా కూడా చేస్తారా అని నెటిజన్లు సైతం అవాక్కై కామెంట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details