LIVE : హైదరాబాద్‌లో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశం - MALLIKARJUN KHARGE PRESS MEET LIVE - MALLIKARJUN KHARGE PRESS MEET LIVE
Published : May 10, 2024, 12:34 PM IST
|Updated : May 10, 2024, 1:06 PM IST
Mallikarjun Kharge Press Meet in Hyderabad Live : శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే హవాను పార్లమెంటు ఎన్నికల్లో చూపించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈసారి 14 లోక్‌సభ స్థానాల కంటే తక్కువ రాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కలేసుకుంటుంది. ఈ స్థానాలు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని చూస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో జరిగిన భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కూడా వివిధ సభల్లో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్‌ను నింపారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉండటం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇంకా మరొక్క రోజులో ప్రచారం ముగుస్తుందనగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు.
Last Updated : May 10, 2024, 1:06 PM IST