LIVE : రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు - MAHASHIVRATRI CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
Published : Feb 26, 2025, 6:25 AM IST
|Updated : Feb 26, 2025, 2:19 PM IST
Mahashivratri Celebrations 2025 Live : మహాశివరాత్రి వేళ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు జరుగుతున్నాయి. శివ నామస్మరణలతో శైవ క్షేత్రాలు మార్మోగిపోతున్నాయి. వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శనానికి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వేకువజామున లేచి పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు శివాలయాలకు దారులు తీశారు. అన్ని శైవక్షేత్రాలు శివ నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. శైవక్షేత్రాల వద్ద భక్తులు ముక్కంటి దర్శనానికి బారులు తీరారు. ఏ శైవక్షేత్రం చూసినా సరే భక్తుల క్యూలైన్లతో కనిపిస్తోంది. అదే విధంగా వివిధ ఆలయాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Feb 26, 2025, 2:19 PM IST