'వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపి - ఆ విషయంలో ప్రపంచంలోనే నెంబర్ 1 ఆసుపత్రిగా రికార్డు సృష్టించి..' - DR G Nageswara Rao Interview - DR G NAGESWARA RAO INTERVIEW
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 10:29 AM IST
Dr Gullapalli Nageswara Rao Interview : ప్రపంచం ఓ రంగుల హరివిల్లు. ఉదయపు సూర్యుడిది ఓ రంగు, వికసించిన కలువది మరో రంగు. సాయం సంధ్యవేళ మబ్బులది ఇంకో రంగు. ప్రపంచంలోని ప్రతీది రంగులమయమే. ఆ రంగులను హృదయాంతరాలకు చేర్చి మనసుకు ఆనందాన్ని పంచేవి, నిత్య జీవితం సాఫీగా సాగేందుకు ముఖ్యమైనది చూపే. అనుకోని అనారోగ్య సమస్యలు, ప్రమాదాల్లో చూపును కోల్పోయిన వేలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్. 50 వేల మందికి దిగ్విజయంగా కార్నియా ట్రాన్స్ ప్లాంటేషన్లు పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆసుపత్రిగా రికార్డు సృష్టించింది.
పేదల కోసం ఉచితంగా వైద్య సైవలు అందించటం, మారుమూల పల్లెల్లోని వారికి మెరుగైన వైద్యం అందించేందుకు విజన్ సెంటర్ల ఏర్పాట్లు, కంటి వైద్యానికి సంబంధించిన ఆధునిక రీసెర్చ్ వంటివి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రత్యేకతలు. కార్నియా ట్రాన్స్ ప్లాంటేషన్లలో గొప్ప మైలురాయిని చేరిన సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రశాంత్ గార్గ్, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చెందిన శాంతిలాల్ సంఘ్వీ, కార్నియా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.