తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE: లోక్​సభ స్పీకర్ ఎన్నిక - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Sessions 2024 Live - LOK SABHA SESSIONS 2024 LIVE

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 11:00 AM IST

Updated : Jun 26, 2024, 1:15 PM IST

Lok Sabha Sessions 2024 Live : 18వ లోక్​సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. తొలి రెండ్రోజుల్లో ఈనెల 24, 25వ తేదీల్లో ఎంపీలుగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగడం గమనార్హం. సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
Last Updated : Jun 26, 2024, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details