తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్కూటీని తప్పించబోయి కారును ఢీ కొట్టిన కంటైనర్‌ - సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు - Road Accident in Choutuppal - ROAD ACCIDENT IN CHOUTUPPAL

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 5:31 PM IST

Live Video Container hits Car at Choutuppal in Nalgonda : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ టూ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారును కంటైనర్ వాహనం ఢీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న భారీ కంటైనర్ వాహనం రెడ్డిబావి వద్ద జాతీయ రహదారిని దాటుతున్న స్కూటీని తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. అంతే వేగంతో హైదరాబాద్ రోడ్డుపైకి దూసుకొచ్చింది. 

రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు : ఆ సమయంలోనే విజయవాడకు వెళుతున్న ఓ కారుని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రోడ్డు ప్రమాదం దృశ్యాలు నమోదయ్యాయి. కొద్దిసేపటి వరకు ఆ రహదారిలో ట్రాఫిక్​ స్తంభించిపోయింది. దీంతో వెంటనే పోలీసులు ట్రాఫిక్​ క్లియర్​ చేస్తూ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.   

ABOUT THE AUTHOR

...view details