చోరీకి గురైన 90 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన ఎల్బీనగర్ పోలీసులు - LB NAGAR POLICE RECOVERED 90 PHONES - LB NAGAR POLICE RECOVERED 90 PHONES
Published : Oct 1, 2024, 4:04 PM IST
LB Nagar Police Recovered 90 Mobile Phones : ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు గురైన 90 సెల్ఫోన్లను ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు సమర్థవంతంగా రికవరీ చేశారు. సీఐఆర్తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మొబైల్స్ మొత్తం తమిళనాడు, ముంబయి, కర్ణాటక, రాజస్థాన్, తదితర ప్రాంతాల్లో నుంచి రికవరీ చేసిన క్రైమ్ టీమ్‌ను ఏసీపీ అభినందించారు.
ఎల్బీనగర్ క్రైమ్ టీం ఈ ఆపరేషన్ కోసం చాలా కష్టపడ్డారని కొనియాడారు. వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం చేసుకుంటున్న మధ్య తరగతి ప్రజల నుంచి ఫోన్లను నిందితులు దొంగిలించారని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగినట్లు తెలిపారు. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సెల్‌ఫోన్స్‌ను అందజేశారు.