సుప్రీం తీర్పులకు భిన్నంగా సహజ వనరులను జగన్ కట్టబెడుతున్నారు: లంకా దినకర్ - Lanka Dinakar on CM Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 7:16 PM IST
Lanka Dinakar Allegations on CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోసం అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. సహజ వనరుల కేటాయింపు ఏ విధంగా జరగాలో సుప్రీంకోర్టు వివిధ తీర్పులల్లో స్పష్టంగా పేర్కొన్నా అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్(Sujalan Energy Limited) - యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కలిసి జాయింట్ వెంచర్ సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయని మధ్యలో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగిరిపోయి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ మాత్రమే ప్రభుత్వ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకునే వెసులుబాటు వెనక ఒత్తిడి ఎవరిది అని ప్రశ్నించారు. వాస్తవానికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అనంతపురంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి ఆపేశారని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎనర్జీ యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ చైర్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని దినకర్ అన్నారు.