ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ - ప్రత్యక్షప్రసారం - KTR PRESSMEET ED INVESTIGATION
Published : Jan 16, 2025, 6:38 PM IST
|Updated : Jan 16, 2025, 6:49 PM IST
KTR Speaking To The Media after ED Investigation : ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ విచారణ అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ ఎదుట కేటీఆర్ విచారణ జరిగింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి నేరుగా విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ఆరాతీసినట్లు సమాచారం తెలిసింది. ప్రధానంగా రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ విచారణ చేసింది. అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిల వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ విచారణ జరిగింది. ఏసీబీ కేసు ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రావడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఈడీ ఆఫీస్‌కు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Jan 16, 2025, 6:49 PM IST