LIVE : రాజేంద్రనగర్‌లో కేటీఆర్ రోడ్‌షో - KTR ROAD SHOW IN RAJENDRANAGAR - KTR ROAD SHOW IN RAJENDRANAGAR
Published : Apr 23, 2024, 12:31 PM IST
|Updated : Apr 23, 2024, 12:46 PM IST
KTR Road Show in Rajendranagar : లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నేరుగా జనాల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వాడీవేడీ ఉపన్యాసాలతో ఒక్కసారిగా సమ్మర్ హీట్ కంటే రాజకీయ హీట్‌ను పెంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా వెళుతున్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. రాజేందర్ నగర్లో నిర్వహించిన రోడ్ షో కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసారి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు.
Last Updated : Apr 23, 2024, 12:46 PM IST