LIVE : సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ రోడ్ షో - KTR Road Show at Secunderabad
Published : May 3, 2024, 7:18 PM IST
|Updated : May 3, 2024, 7:28 PM IST
KTR Road Show at Secunderabad Live : లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 12స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే, ఏడాదిలోగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో బడే భాయ్ నరేంద్ర మోదీ బడా మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని దుయ్యబట్టారు. అదే మాదిరి 2023లో చోటా భాయ్ రేవంత్‌రెడ్డి మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అచ్చేదిన్ కాదు, సచ్చేదిన్ వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కాషాయ పార్టీ ఏం చేసిందని ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే సాకుతో ఎన్నికల కమిషన్, తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతు పైనే నిషేధం విధించడం అరాచకమంటూ ధ్వజమెత్తారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని ప్రశ్నించారు. మోదీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని విరుచుకుపడ్డారు.
Last Updated : May 3, 2024, 7:28 PM IST