LIVE : సిరిసిల్లలో కేటీఆర్ మీడియా సమావేశం - KTR LIVE FROM HYDERABAD
Published : May 14, 2024, 4:02 PM IST
|Updated : May 14, 2024, 4:16 PM IST
లోక్‌సభ ఎన్నికలు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి సంకటంగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కఠిన సవాల్‌ను విసిరాయి. నేతల వలసలు కూడా గులాబీ పార్టీకి ఇబ్బంది కారణంగా మారాయి. మారిన పరిస్థితుల్లో పార్టీ అధినేత కేసీఆర్, ప్రచార పంథాను మార్చి బస్సు యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో 17 రోజుల పాటు బస్సు యాత్ర, రోడ్ షో నిర్వహించి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం వివిధ నియోజకవర్గాలు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల పాలనలో చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ గొంతుకగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో కేటీఆర్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల సరళిపై మాట్లాడుతున్నారు.
Last Updated : May 14, 2024, 4:16 PM IST