తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : కన్నెపల్లిలో కేటీఆర్‌ బృందం - ప్రత్యక్ష ప్రసారం - KTR visits Medigadda - KTR VISITS MEDIGADDA

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 11:40 AM IST

Updated : Jul 26, 2024, 12:06 PM IST

KTR And BRS MLAs And MLCs Visited Medigadda Projects Live : మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆ పార్టీ బృందం సభ్యులు కన్నెపల్లిని సందర్శించారు. అంతకముందుకు ఇందారం వద్ద గోదావరి నదిని బీఆర్ఎస్‌ నేతలు పరిశీలించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గోదావరిని పరిశీలించారు. కాగా గురువారం బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయల్దేరారు. అనంతరం కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్​ఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామన్న ఆయన, చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలం అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ మేడిపండు అని, లక్షల కోట్లు కొట్టుకుపోయాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివేనని తేలాయని కేటీఆర్ అన్నారు. 
Last Updated : Jul 26, 2024, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details