LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్రెడ్డి మీడియా సమావేశం - Minister Kishan Reddy Live - MINISTER KISHAN REDDY LIVE
Published : Apr 29, 2024, 4:53 PM IST
|Updated : Apr 29, 2024, 5:15 PM IST
Kishan Reddy Press Meet Live From BJP Party Office BJP Live : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళావారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న సందర్భంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్లో జరిగే బహిరంగ సమావేశానికి అన్ని రకాల ఏర్పుట్లు చేస్తున్నామని తెలుపుతున్నారు. అలానే మోదీ ప్రతిపక్షాల లోపాలను తెలియజేస్తారని వివరిస్తున్నారు. కేంద్రంలో పది సంవత్సరాల్లో జరిగిన అభిృద్ధిని ప్రజలకు వివరించనున్నారని తెలియజేస్తున్నారు. మోదీ షెడ్యూల్ వివరాలను ప్రజలకు ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముందున్నమని తెలుపుతున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కోట్లు కేటాయించిందని వివరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన సమాన్లు విషయంలో స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై రిజర్వేషన్ల విషయంలో మాఫింగ్ వీడియో చేసి వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Last Updated : Apr 29, 2024, 5:15 PM IST