కేంద్ర ప్రభుత్వ చొరవతోనే బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయి : కిషన్ రెడ్డి - Kishan Reddy about Developments
Published : Feb 13, 2024, 4:52 PM IST
Kishan Reddy about Government Hospitals : కేంద్ర ప్రభుత్వ చొరవ, సహకారంతోనే రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే రైల్వేస్టేషన్ల అభివృద్ధికి చొరవ తీసుకున్నామని, వేసవికి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి సూచించారు. బస్తీ దవాఖానాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
MP Laxman about Musheerabad House Collapse Victims : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వివరించారు. ముషీరాబాద్‌లోని స్వామి వివేకానంద నగర్లో దళితుల ఇల్లు కూల్చివేసిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అడిక్‌మెట్‌లోని స్వామి వివేకానంద ప్రభుత్వ పాఠశాలలో నాలుగున్నర లక్షల రూపాయల వ్యయంతో రేకుల షేడ్ ఏర్పాటు చేసినట్లు అభినందన అప్నాగర్ సంస్థ అధ్యక్షురాలు అభినందన భవాని తెలిపారు.