LIVE : ఖైరతాబాద్ 'సప్తముఖ మహాశక్తి గణపతి' దర్శనానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh Darshan Live
Published : Sep 8, 2024, 11:57 AM IST
|Updated : Sep 8, 2024, 2:04 PM IST
Khairatabad Ganesh Darshan Live : శనివారం నుంచి గణేశుని నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలో ఖైరతాబాద్‌లో 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. తొలి పూజను సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఆరోజు సాయంత్రం గవర్నర్ కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ప్రముఖులు మహాగణపతిని దర్శించుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ అయిన తర్వాత ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచించారు. నిత్యం వేలాది మంది గణపయ్యను చూడడానికి తరలి వస్తుంటారనే సమాచారంతో భద్రతను పూర్తిస్థాయిలో పెంచారు. ఖైరతాబాద్‌లో వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు కావడంతో 70 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేశారు. నేడు రెండో రోజు కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉంది.
Last Updated : Sep 8, 2024, 2:04 PM IST