ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కేశినేని నాని జగన్‌కు పాలేరు, ఇన్‌ఛార్జిలకు అసిస్టెంట్: కేశినేని చిన్ని - Chinni Allegations on Nani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 1:36 PM IST

Keshineni Chinni Allegations on Keshineni Nani: వైసీపీలో చేరిన కేశినేని నాని జగన్​కు పాలేరుగా, ఇన్​ఛార్జిలకు అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడని టీడీపీ నేత కేశినేని శివనాథ్(చిన్నీ) విమర్శించారు. వైసీపీలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబుని విమర్శించే వారిని ముందు ప్రోత్సహించి తర్వాత సీటు ఎగ్గొట్టటం జగన్ నైజమని మండిపడ్డారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవుతాడో, వెల్లంపల్లి అవుతాడో వేచి చూడాలని కేశినేని చిన్ని అన్నారు. కేశినేని నాని వారికి అసిస్టెంట్​గా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేసాడని, మైలవరంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశాడని ఆరోపించారు. 

కేశినేని నాని ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశాడో త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతామని తెలిపారు. కేశినేని నానికి డబ్బులిచ్చి మోసపోయిన వారూ త్వరలోనే మీడియా ముందుకు వస్తారని అన్నారు. తన అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతుండటంతో పార్టీ మారిన కోవర్టు కేశినేని నాని అని దుయ్యబట్టారు. పారిపోవటానికి సిద్ధం అంటూనే వైసీపీ నేతలు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. మరో 2నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details