ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎస్సీ కులానికి చెందిన వాడినని చిన్నచూపు చూస్తున్నారు- కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ - కనిగిరి ఏఎంసీ ఛైర్మన్‌ ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 7:52 PM IST

Kanigiri AMC Chairman Anguish: ఎస్సీ కులానికి చెందిన వాడినని తనను చిన్న చూపు చూస్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి ఏఎంసీ (Agriculture Market Committee) ఛైర్మన్ సాల్మన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సాక్షిగా అవమానపరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ తనను మెచ్చి రెండు నెలల క్రితం ఏఎంసీ ఛైర్మన్​గా నియమించారని పేర్కొన్నారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనను ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారని అన్నారు. 

తాను ఎస్సీ కులానికి చెందిన వాడిని కాబట్టే ఎవరూ పిలవడం లేదని, వైసీపీ నేతలు, పలువురు అధికారులు తనను అవమానపరుస్తున్నారంటూ విలేకరుల సమావేశంలో ఆవేదనను వెలిబుచ్చారు. ముఖ్యంగా వైసీపీలోని ఓ ప్రధాన నాయకుడే అధికారులతో కుమ్మక్కై తనకు ఎటువంటి ఆహ్వానాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ సాల్మన్ రాజు కోరారు.

ABOUT THE AUTHOR

...view details